కొండ రాళ్ల మధ్య చిక్కుకున్న రాజు కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ప్రస్తుతానికి రాజు ఆరోగ్యం నిలకడకగా ఉందని డాక్టర్లు చెప్పారు. ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని తెలిపారు. డీ హైడ్రేషన్ ఉందని, ఇతర పరీక్షలు చేయాలని చెప్పారు.
తన ఆరోగ్యం బాగుందని..తన భార్యా పిల్లల్ని మళ్ళీ చూడటం ఆనందంగా ఉందని రాజు చెప్పాడు. తాను కుందేలు వేటకు వెళ్లానని.. కొండల మధ్యలో పడిపోయిన ఫోన్ ను తీయడానికి వెళ్లి అందులో చిక్కుకుపోయానని చెప్పాడు. భుజానికి గాయం కావడంతో తాను కదలలేకపోయానని చెప్పాడు. తనను రెస్క్యూ చేసి కాపాడిన పోలీసులకు, రెస్క్యూ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపాడు.