- కామారెడ్డి మెడికల్ కాలేజీని వర్చువల్ సిస్టమ్ ద్వారా ప్రారంభించిన సీఎం
- పాల్గొన్న స్పీకర్, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు
కామారెడ్డిటౌన్, వెలుగు : ప్రభుత్వ హాస్పిటల్స్ ద్వారా ప్రజలకి మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట ప్రభుత్వం కృషి చేస్తోందని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వర్చువల్ విధానంలో సీఎం కేసీఆర్ కామారెడ్డి మెడికల్ కాలేజీని ప్రారంభించారు. అనంతరం సీఎంకు కృతజ్నతలు తెలుపుతూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ర్ట ప్రభుత్వం వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు.
విప్ గంప గోవర్ధన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం కాలేజీ తో పాటు 350 బెడ్స్ హాస్పిటల్ వచ్చిందని త్వరలో 500 బెడ్స్ హాస్పిటల్ వస్తుందన్నారు. కలెక్టర్ జితేశ్ పాటిల్ మాట్లాడుతూ.. వైద్య విద్యను ఎంచుకున్న స్టూడెంట్స్ కష్టపడి చదవి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు. కామారెడ్డి జిల్లా మంచి కేంద్రమని, స్టూడెంట్స్‌కు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేశామని తెలిపారు.
ALSO READ: జోగు రామన్న అబద్దపు ప్రచారాలు మానుకోవాలి: సుహాసినీరెడ్డి
కార్యక్రమంలో ఎమ్మెల్యేలు హన్మంతుషిండే, జాజాల సురేందర్, జడ్పీ ఛైర్పర్సన్ దఫేదర్ శోభ, స్టేట్ ఉర్ధు ఆకాడమీ ఛైర్మన్ ఎం.కె. ముజీబొద్ధిన్, డీసీసీబీ ఛైర్మన్ భాస్కర్‌రెడ్డి, జిల్లా లైబ్రరీ ఛైర్మన్ పున్న రాజేశ్వర్, మున్సిపల్ ఛైర్ పర్సన్ నిట్టు జాహ్నవి, ఎస్పీ బి. శ్రీనివాస్‌రెడ్డి, కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశ్వర్, అడిషనల్ కలెక్టర్లు మధుచౌదరి, చంద్రమోహన్, ప్రొఫెసర్లు, మెడిసిన్ స్టూడెంట్స్ తదితరులు పాల్గొన్నారు.