కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి తన మంచి మనసు చాటుకున్నారు. రోడ్డు విస్తరణలో తన ఇళ్లు అడ్డుగా ఉందని.. దాన్ని కూల్చివేయడానికి స్వచ్ఛందంగా ఎమ్మెల్యే ముందుకు వచ్చారు. దీంతో ఆయనపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి అధికారులతో మాట్లాడి రోడ్డుకు అవసరమైన వరకు దగ్గరుండి అధికారుల సమక్షంలో 2024 జనవరి 27న కూల్చివేత ప్రారంభించారు. ఎమ్మెల్యే ఇంటి నుంచి పాత బస్టాండ్ వరకు రోడ్డు వెడల్పు కోసం అడ్డుగా ఉన్న నిర్మాణాలకు అధికారులు నోటీసులివ్వనున్నారు. రోడ్డు వెడల్పులో భాగంగా అడ్డుగా ఉన్న వాటిలో రెండు సినిమా థియేటర్లు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నివాసం కూడా ఉన్నాయి.
గత ఏడాది మాస్టర్ ప్లాన్ లో భాగంగా రోడ్ల వెడల్పుపై అధికార పార్టీ నాయకులతో మాటల యుద్ధం నడిచింది. అయితే ఇప్పుడు ఈ సమస్యపై ముందుకు వెళ్లనున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి ముందు తన ఇంటి నుంచే శ్రీకారం చూడతానని గతంలో చెప్పారు. ప్రస్తుతం మాట నిలబెట్టుకోవడంతో రోడ్డు వెడల్పులో ఉన్న మిగతా ఇళ్లవారంతా ఆందోళన చెందుతున్నారు.