కామారెడ్డి టౌన్, వెలుగు: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కామారెడ్డిలోని అన్ని స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. గురువారం కామారెడ్డి టౌన్‌కు చెందిన పలువురు యువకులు ఎమ్మెల్యే సమక్షంలో బీజేపీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇంకా నేరవేర్చలేదన్నారు. మహారాష్ర్ట, జార్ఖండ్ రాష్ర్టాల ఎన్నికల ఫలితాల్లో బీజేపీ గెలుపు ఖాయమన్నారు. పార్టీ టౌన్ ప్రెసిడెంట్ ఆకుల భరత్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మోటూరి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
రెసిడెన్షియల్ స్కూల్ తనిఖీ
మాచారెడ్డి ఎస్టీ బాలికల మినీ రెసిడెన్షియల్ స్కూల్‌ను గురువారం కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. రుచికరమైన భోజనం పెట్టడంతో పాటు, మంచి విద్యాబోధన అందించాలని టీచర్లకు సూచించారు.