
- అసెంబ్లీలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణరెడ్డి
కామారెడ్డి, వెలుగు : ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తుల ద్వారా జిల్లా ఇన్చార్జి మంత్రి ప్రొసీడింగ్స్ ఇవ్వటం ఏమిటని కామారెడ్డి ఎమ్మెల్యే కె. వెంకటరమణరెడ్డి పేర్కొన్నారు. సోమవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేలుగా గెలిచిన వ్యక్తులకు ప్రయార్టీ ఇవ్వాలన్నారు. తానేమీ పోలీసు రక్షణ, పోలీస్ ప్రొటో కాల్ గురించి అడగట్లేదన్నారు.
ఇన్చార్జి మంత్రి పాత్ర ఏమిటన్నారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట వీరిని నియంత్రించేందుకు ఇన్చార్జి మంత్రులను పెట్టరా.. అని అన్నారు. 84 ప్రశ్నలు అడిగితే 8 ప్రశ్నలకు మాత్రమే సమాధానం వచ్చిందన్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా పెట్టిన ప్రశ్నలకు కూడా ఆయా శాఖల ద్వారా సమాచారం రావట్లేదన్నారు. ఎమ్మెల్యేలకు ఇచ్చే మర్యాదా..? ఇదేనా అని ప్రశ్నించారు.