
- కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణరెడ్డి
కామారెడ్డి, వెలుగు : అధికారులు, సిబ్బంది తప్పులు చెయొద్దని, చేస్తే సహించే ప్రసక్తే లేదని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణరెడ్డి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం మున్సిపల్ అధికారులు, సిబ్బందితో ఆయా విభాగాలపై రివ్యూ చేశారు. ముందు శానిటేషన్, వాటార్ వర్క్స్ సిబ్బందితో మాట్లాడారు. కార్మికులు నిబద్ధతతో పని చేయాలన్నారు. కార్మికులు అధికారులు, ఇతర ఇండ్లలో పని చేయవద్దన్నారు. ఆవుట్ సోర్సింగ్ సిబ్బంది కొందరు ఇన్ఫార్మర్లుగా పని చేస్తున్నారని, వారు తమ పద్ధతిని మార్చుకోవాలన్నారు.
అనంరతం ఇంజినీరింగ్, టౌన్ఫ్లానింగ్, వాటర్ వర్క్స్ విభాగం అధికారులతో చర్చించారు. టౌన్లో అక్రమ నిర్మాణాలు ఎన్ని ఉన్నాయి, వాటికి నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకున్నారా.. అంటూ అధికారులను ప్రశ్నించారు. రూల్స్ ప్రకారమే నిర్మాణాలు జరిగేలా అధికారులు చూడాలన్నారు. ఇంటి పన్నులు వంద శాతం వసూలు చేయాలన్నారు.
ఎండకాలం దృష్ట్యా పట్టణంలో
తాగునీటి సమస్య రాకుండా చూడాలని అధికారులకు సూచించారు. సకాలంలో జీతాలు అందేలా చూడాలని కార్మికులు కోరగా, కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, ఆయా విభాగాల అధికారులు పాల్గొన్నారు.