
కామారెడ్డిటౌన్, వెలుగు : తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఆయన పర్యటించి సమస్యలపై ఆరా తీశారు. పలు సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా అధికారులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్యే వెంట బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ మోటూరి శ్రీకాంత్, లీడర్లు లక్ష్మారెడ్డి, వేణు తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఒకరూ అంబేడ్కర్ జీవిత చరిత్ర తెలుసుకోవాలి
కామారెడ్డిటౌన్, వెలుగు : ప్రతి ఒకరూ అంబేద్కర్ జీవిత చరిత్ర తెలుసుకోవాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని రోటరీ ఆడిటోరియంలో అంబేద్కర్ జీవిత చరిత్రపై బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ నీలం చిన్న రాజులు అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ గ్రామాన మీటింగ్ ఏర్పాటు చేసి మహానీయుడు అంబేద్కర్ జీవిత చరిత్రను వివరించాలన్నారు. భారత రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ కీలక పాత్ర పోషించారన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ దుగ్యాల ప్రదీప్‌కుమార్, రాష్ర్ట అధికార ప్రతినిధి వీరేందర్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే అరుణతార, మాజీ మంత్రి నేరళ్ల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. కశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో మృతులకు సంతాపం తెలుపుతూ మౌనం పాటించారు.