కామారెడ్డి మున్సిపల్​ బడ్జెట్  రూ. 48.58 కోట్లు

కామారెడ్డి , వెలుగు: రూ. 48. 58 కోట్లతో రూపొందించిన  వార్షిక బడ్జెట్​ను కామారెడ్డి మున్సిపల్​ కౌన్సిల్​ ఆమోదించింది.  ​చైర్​పర్సన్ ​ నిట్టు జాహ్నవి అధ్యక్షతన శనివారం  కళాభారతి ఆడిటోరియంలో కౌన్సిల్​ మీటింగ్​జరిగింది.  ప్రాపర్టీ టాక్స్ ద్వారా ​రూ. 12.51 కోట్లు,  రెవెన్యూ, ఇతర మార్గాల ద్వారా రూ.11.64 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు.  ప్లాన్​​గ్రాంట్స్​, నాన్​ ప్లాన్​ గ్రాంట్స్​ కింద రూ. 24.25 కోట్లు అంచనా వేశారు. మొత్తం ఆదాయం రూ.48.58 కోట్లు చూపగా,  వ్యయం కూడా  అంతే చూపారు. ఏప్రిల్1 నాటికి ప్రారంభ నిల్వ  రూ.25.66 కోట్లు   ఉంటుందని చెప్పారు. సిబ్బంది జీతాలకు రూ. 9.69 కోట్లు, శానిటేషన్​ ఖర్చు రూ.  2.87 కోట్లు,  కరెంటు బిల్లులు రూ. 5.32 కోట్లు,  గ్రీన్​ బడ్జెట్​కు రూ. 2.82 కోట్లుగా ప్రతిపాదించినట్లు చైర్ ​పర్సన్​ చెప్పారు. అయితే ఆదాయం, వ్యయం సమానంగా  చూపడంతో పలువురు కౌన్సిలర్లు అభ్యంతరం తెలిపారు.   కొత్త ఆదాయ మార్గాల ప్రస్తావన లేదని, ఉన్న వనరులను  వినియోగించుకుని ఆదాయాన్ని పెంచుకునే అంశంపై దృష్టి పెట్టలేదని  పలువురు కౌన్సిలర్లు అభిప్రాయపడ్డారు.  గత బడ్జెట్​ ప్రతిపాదనల్లో చూపిన విధంగా ఫండ్స్​ ఎందుకు తీసుకురాలేదని బీజేపీ ఫ్లోర్​ లీడర్​ శ్రీకాంత్ ప్రశ్నించారు. 

ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలి

కామారెడ్డి మున్సిపాలిటీని రోల్​మోడల్​గా తీర్చిదిద్దాలని  కలెక్టర్​ జితేశ్​వి పాటిల్ పేర్కొన్నారు. పట్టణ ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన పై ఫోకస్​పెట్టాలన్నారు. నీటి ఎద్దడి నివారణకు ప్రత్యేకంగా ప్లానింగ్​ తయారు చేయాలన్నారు. అభివృద్ధి విషయంలో కౌన్సిలర్లు, ఆఫీసర్లు  సమష్టిగా పని చేయాలన్నారు. చైర్​పర్సన్​ జాహ్నవి  మాట్లాడుతూ.. మున్సిపాలిటీకి  సమకూరే  ఫండ్స్​తో పట్టణాన్ని మరింత  అభివృద్ధి చేస్తామన్నారు. వైస్​  చైర్​ పర్సన్​ ఇందుప్రియ, కమిషనర్​  దేవెందర్​, కౌన్సిలర్లు పాల్గొన్నారు. 

పలు అంశాలపై దుమారం..

బడ్జెట్​ మీటింగ్​తర్వాత  మున్సిపల్​జనరల్ మీటింగ్ జరిగింది. బిల్డింగ్​పర్మిషన్లు, నిధుల మళ్లింపుపై దుమారం చెలరేగడంతో  అధికారులపై బీఆర్ఎస్​కౌన్సిలర్లు ప్రతిపక్ష పార్టీల కంటే ఎక్కువగా ధ్వజమెత్తారు. మున్సిపాలిటీలోని  ఖాళీ స్థలాలు కబ్జా అవుతున్నా, ఇండ్లు కడుతున్నా.. పట్టించుకోవడం లేదని  కౌన్సిలర్​ చాట్ల వేణు మండిపడ్డారు. స్పందించిన కలెక్టర్​తనకు పూర్తి వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. తన వార్డుకు కేటాయించిన ఫండ్స్​తో వర్క్స్​చేయకుండా ఎందుకు ఆపేశారని  కౌన్సిలర్​ భూక్యా రాజు ప్రశ్నించారు. చైర్​పర్సన్​, కమిషనర్​కు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. ఎస్ఎఫ్సీ ఫండ్స్ ప్రతిపాదించిన 9 పనులకు గాను 6 పనులకు  జనరల్ ఫండ్స్​ డైవర్ట్ చేయడంపై కొందరు బీఆర్ఎస్​, బీజేపీ కౌన్సిలర్లు అభ్యంతరం తెలిపారు.  పర్మిషన్​లేని బిల్డింగ్​నిర్మాణాలపై స్పందించిన ఆఫీసర్లు టీఎస్​బీ పాస్​ ద్వారా పర్మిషన్లు వస్తున్నాయని తెలిపారు. ఎన్​ఫోర్స్​మెంట్ ​టీమ్​కూడా పరిశీలిస్తోందని, ఆన్​లైన్​లో పర్మిషన్లు వస్తున్నాయని పేర్కొన్నారు. రూల్స్​కు విరుద్ధంగా బిల్డింగ్​లు కడితే కూల్చివేస్తామని తెలిపారు. పట్టణంలో చాలా చోట్ల తాగునీటి  పైప్​లైన్లు లీకేజీ అవుతున్నాయని, రిపేర్లు చేయాలని బీజేపీ ఫ్లోర్​ లీడర్​ శ్రీకాంత్​కోరారు.