- ఫండ్స్ డైవర్షన్ ఎలా చేస్తారని కౌన్సిలర్ల ప్రశ్నలు
- నెలలు గడుస్తున్నా స్ట్రీట్‌లైట్లు పెట్టడంలేదని ఆగ్రహాం
- పని చేయని లైట్లు తీసుకొచ్చి మీటింగ్‌లో నిరసన
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి మున్సిపల్చివరి మీటింగ్ గురువారం వాడీవేడిగా జరిగింది. చైర్పర్సన్గడ్డం ఇందుప్రియ అధ్యక్షతన మున్సిపల్ మీటింగ్ జరిగింది. సమావేశానికి అధికారులు, కౌన్సిలర్లు హాజరయ్యారు. ఈనెల ఆఖరుకు మున్సిపాల్పాలక వర్గం గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో పలు ఆంశాలు, ఫండ్స్ కేటాయింపులకు సంబంధించిన అజెండాపై చర్చించారు.
15వ ఆర్థిక సంఘం జనరల్ వర్క్స్‌కు డైవర్ట్ చేయడంపై పలువురు సభ్యులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 15వ ఆర్థిక ఫండ్స్‌ను జనరల్ ఫండ్స్ బిల్లులకు ఎందుకు చెల్లిస్తారని ప్రశ్నించారు. కొన్ని వార్డుల్లోనే డెవలప్మెంట్వర్క్స్చేస్తున్నారని, మిగతా వార్డుల పరిస్థితి ఏమిటంటూ సమావేశంలో ప్రస్తావించారు. వార్డుల్లో గత రెండు నెలలుగా స్ట్రీట్ లైట్లు వెలగడం లేదని, లైట్లు ఏర్పాటు చేయాలని చెప్పిన పట్టించుకోవట్లేదన్నారు. కాంట్రాక్టర్‌ను అడిగితే తనకు బిల్లులు చెల్లించటం లేదని చెబుతున్నారన్నారు.
మూడు నెలలుగా తన వార్డులో పని చేయని లైట్లను తెచ్చి టెకిర్యాల్కౌన్సిలర్ శంకర్రావు నిరసన తెలిపారు. లైట్ల బిగింపునకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. వాటార్ వర్క్స్ ఫిల్టర్ బెడ్ వద్ద ఉన్న పాత సామగ్రిని అమ్మివేయటంపై సభ్యులు ప్రశ్నించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కమిషనర్ స్పందన తెలిపారు. పాలక వర్గం గడువు ముగియనుండడంతో పలు అంశాలకు అమోదం తెలిపారు.