
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి మున్సిపల్ వైస్‌చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ, ఈమె భర్త చంద్రశేఖర్‌రెడ్డి, మరో కౌన్సిలర్ చాట్ల వంశీ మంగళవారం హైదరాబాద్‌లో పీసీసీ ప్రెసిడెంట్రేవంత్రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. వీరంతా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు. వైస్ చైర్ పర్సన్ భర్త గడ్డం చంద్రశేఖర్‌రెడ్డిని బీఆర్ఎస్ నుంచి ఆదివారం సస్పెండ్ చేశారు.
దీంతో మరుసటి రోజే కాంగ్రెస్ లో చేరారు. వీరితో పాటు గడ్డంసూర్య, అరవింద్, బల్ల శ్రీనివాస్, బండారి శ్రీకాంత్, వేణు, ఇమ్రాన్, చేవేళ్ల రాజు చేరిన వారిలో ఉన్నారు. డీసీసీ ప్రెసిడెంట్ కైలాస్ శ్రీనివాస్‌రావు, బ్లాక్‌కాంగ్రెస్ ప్రెసిడెంట్ గొనే శ్రీనివాస్ ఉన్నారు.