
- హెల్మెట్ ధరించని చలాన్లే అధికం
- రూల్స్ పాటించాల్సిందే : ఎస్పీ రాజేశ్చంద్ర
కామారెడ్డి, వెలుగు : నిబంధనలకు విరుద్ధంగా వాహనాల నడిపేవారిపై జిల్లా పోలీస్ యంత్రాంగం కొరడా ఝులిపిస్తోంది. ఈ ఏడాది 3 నెలల్లో 1,19,606 చలాన్లు విధించారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో వెహికల్స్ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ రాజేశ్చంద్ర తెలిపారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయవద్దని, తప్పని సరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. రూల్స్ పాటించని వారికి, మైనర్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్లకు జరిమానాలు విధించడంతోపాటు కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
ఈ ఏడాది జనవరి నుంచి మార్చి నెలాఖరు వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ 3,026, సెల్ ఫోన్ డ్రైవింగ్ 540, నంబర్ ప్లేట్లు సరిగ్గా లేకపోవటం, నంబర్లు చేరిపేయటం వంటి వాటికి 3,838, మైనర్ డ్రైవింగ్లు 49, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ 89,936, సిగ్నల్ జంప్ 24, త్రిబూల్ రైడింగ్ 1,186, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా 3,522, రాంగ్ సైడ్ డ్రైవింగ్ 548, ఓవర్ స్పీడ్ 8,868, స్పీడ్ గన్ ఫైన్లు 8,069 చలాన్లు విధించినట్లు ఎస్పీ పేర్కొన్నారు.