![రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు : ఎఎస్పీ చైతన్యరెడ్డి](https://static.v6velugu.com/uploads/2025/02/kamareddy-police-takes-proactive-measures-to-prevent-road-accidents_XSO59FRsbP.jpg)
కామారెడ్డిటౌన్, వెలుగు: రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు కామారెడ్డి ఎఎస్పీ చైతన్యరెడ్డి పేర్కొన్నారు. దేవునిపల్లి పోలీస్స్టేషన్పరిధిలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగిన ఏరియాలను బుధవారం ఎఎస్పీ పరిశీలించారు. గతేడాది కాలంగా ఎక్కువగా యాక్సిడెంట్లు జరిగిన ప్రాంతాలను హాట్ స్పాట్‌లుగా గుర్తించి ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
క్యాసంపల్లి, టెకిర్యాల్ శివార్లను ఆమె పరిశీలించారు. స్పీడ్బేకర్లు ఏర్పాటు చేయడం,హెచ్చరిక బోర్డుల ఏర్పాటు అంశాలపై సూచనలు చేశారు. రూరల్ సీఐ రామన్, దేవునిపల్లి ఎస్సై రాజు ఉన్నారు.