ఆరు నెలల్లో రైల్వే స్టేషన్ పనులు పూర్తి : ఎంపీ సురేష్​ షెట్కార్

ఆరు నెలల్లో రైల్వే స్టేషన్ పనులు పూర్తి : ఎంపీ సురేష్​ షెట్కార్
  • ఎంపీ సురేష్​ షెట్కార్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ
  • కామారెడ్డి రైల్వే స్టేషన్ లో పనుల పరిశీలన 

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి రైల్వే స్టేషన్​లో రూ. 39 కోట్లతో చేపడుతున్న ఆధునీకీకరణ పనులు 6 నెలల్లో పూర్తవుతాయని జహీరాబాద్ ఎంపీ సురేష్​ షెట్కార్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ పేర్కొన్నారు. సోమవారం  రైల్వే స్టేషన్​లో జరుగుతున్న  పనులను వారు పరిశీలించి, రైల్వే అధికారులతో మాట్లాడారు. స్టేషన్​ మెయిన్ ఎంట్రెన్స్​ గేట్​ వెడల్పు చేయనున్న దృష్ట్యా ఇరువైపులా ఉన్న కొన్ని షాపులను తొలగించాల్సి ఉందన్నారు.  ప్రత్యామ్నాయంగా భవిష్యత్​లో రైల్వే అధికారులు నిర్మించే  కాంప్లెక్స్​లో షాపుల కేటాయింపునకు ప్రయార్టీ ఇవ్వాలన్నారు.

 ప్రయాణికుల సౌకర్యార్థం ఎస్కలేటర్,  లిప్టు సౌకర్యంతో పాటు,  ఫ్లాట్ ఫారాల ఆధునీకీకరణ,   రెస్టు రూమ్​ల నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు.  కలెక్టరేట్,  పాత రాజంపేట సమీపంలో ఆర్వోబీ, ఆర్​యూబీ బ్రిడ్జిల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. వారి వెంట అడిషనల్ కలెక్టర్ విక్టర్, రైల్వే ఇంజినీరింగ్​ అధికారి ఆశిష్​, జిల్లా లైబ్రరీ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, కాంగ్రెస్ టౌన్, మండల ప్రెసిడెంట్లు పండ్ల రాజు, గూడెం శ్రీనివాస్​రెడ్డి తదితరులు ఉన్నారు.