రోటరీ క్లబ్​ మాజీ అధ్యక్షులకు అవార్డులు

రోటరీ క్లబ్​ మాజీ అధ్యక్షులకు అవార్డులు

కామారెడ్డిటౌన్, వెలుగు: హైదరాబాద్​లో శని, ఆదివారాల్లో రోటరీ కాన్ఫరెన్స్​అలయ్​ బలయ్​ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా 25 ఏళ్లుగా రోటరీ క్లబ్​ తరఫున సేవా కార్యక్రమాలు చేపడుతున్న వారికి అవార్డులు ప్రదానం చేశారు.  కామారెడ్డికి చెందిన క్లబ్​మాజీ అధ్యక్షులు డాక్టర్​ బాల్​రాజు, ధనుంజయ్, పబ్బ జగన్నాథం, కాశీనాథం, సుభాష్​​చంద్ జైన్​అవార్డులు అందుకున్నారు. క్లబ్​అసిస్టెంట్​గవర్నర్ జైపాల్​రెడ్డి, ప్రెసిడెంట్​రాజనర్సింహారెడ్డి, ప్రతినిధులు శ్రీశైలం, శంకర్, కృష్ణహరి, సుధాకర్ పాల్గొన్నారు.