మహిళల రక్షణ కోసమే షీ టీమ్

మహిళల రక్షణ కోసమే షీ టీమ్

కామారెడ్డి టౌన్​, వెలుగు : మహిళల రక్షణ కోసమే షీ టీమ్  ఉందని కామారెడ్డి ఎస్పీ రాజేశ్​ చంద్ర పేర్కొన్నారు.   శుక్రవారం  జిల్లా పోలీసు ఆఫీసులో  షీ టీమ్​ మెంబర్లు సౌజన్య, ప్రవీణలను ఎస్పీ అభినందించి క్యాష్​ రివార్డు అందించారు.  

స్కూల్స్, కాలేజీల్లో  విద్యార్థులకు ‘గుడ్​ టచ్​ బ్యాడ్​ టచ్’ షీటీమ్​పై  అవగాహన కల్పిస్తున్నందున క్యాష్​ అవార్డు అందించారు. ఎస్పీ మాట్లాడుతూ మహిళలు, యువతులు  ఎలాంటి సమస్యలు ఉన్నా నిర్భయంగా షీటీంలను సంప్రదించాలన్నారు. షీ టీమ్​ నంబర్​ 8712686094కు ఫిర్యాదు చేయాలన్నారు.