
- కామారెడ్డి ఎస్పీ రాజేశ్ చంద్ర
కామారెడ్డిటౌన్, వెలుగు : పోలీసుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎస్పీ రాజేశ్ చంద్ర పేర్కొన్నారు. శనివారం జిల్లా పోలీస్ ఆఫీస్లో స్పెషల్ పార్టీ, ఆర్మీడ్ రిజర్వు, ఎస్కార్ట్, బీడీ టీమ్, డాగ్ స్క్వాడ్, పీఎస్వోలతో ఎస్పీ దర్బార్ నిర్వహించారు. ఆయా విభాగాల సిబ్బందితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో సాయుధ పోలీస్ బలగాల పాత్ర కీలకమన్నారు. కుటుంబ సంక్షేమంపై దృష్టి పెట్టడంతోపాటు వృత్తి నైపుణ్యాలను పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, ఏఆర్ డీఎస్పీ యాకుబ్రెడ్డి, ఆర్ఐ సంతోష్, ఎస్బీ సీఐ తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.
నిందితులకు శిక్ష పడాలి..
నిందితులకు శిక్షపడితేనే బాధితులకు న్యాయం జరుగుతుందన్నారు. శనివారం జిల్లా పోలీస్ఆఫీస్లో కోర్టు సిబ్బందికి నిర్వహించిన ట్రైనింగ్ పోగ్రాంలో ఎస్పీ మాట్లాడుతూ షెడ్యూల్ ప్రకారం కోర్టులో సాక్షులు హాజరయ్యేలా చూడాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ట్రయల్ బ్రేక్ కావొద్దన్నారు. సమన్లు, వారెంట్లు పెండింగ్ లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, డీసీఆర్బీ సీఐ మురళీ, సిబ్బంది పాల్గొన్నారు.