శాంతి భద్రతలను పరిరక్షించండి : కామారెడ్డి ఎస్పీ రాజేశ్​ చంద్ర,   

శాంతి భద్రతలను పరిరక్షించండి : కామారెడ్డి ఎస్పీ రాజేశ్​ చంద్ర,   

కామారెడ్డి, వెలుగు: నిరంతరం అందుబాటులో ఉంటూ శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్​ అధికారులు కృషి చేయాలని కామారెడ్డి ఎస్పీ రాజేశ్​ చంద్ర సూచించారు. గురువారం మాచారెడ్డి, రామారెడ్డి పోలీస్ స్టేషన్లను ఎస్పీ తనిఖీ చేశారు. అనంతరం  స్టేషన్ రికార్డులు, హిస్టరీ షీట్స్ పరిశీలించి, కేసులు పెండింగ్ లేకుండా చూసుకోవాలన్నారు. విలేజ్ పోలీస్ ఆఫీసర్ల  వివరాలను అడిగి  తెలుసుకున్నారు.

విజిబుల్ పోలీసింగ్ ఉండాలని, సిబ్బంది అధికారులు స్టేషన్ కు వచ్చిన వారితో మర్యాదగా మాట్లాడాలన్నారు. హిస్టరీ షీటర్స్, సస్పెక్ట్స్ , పాత నేరస్తులపై నిఘా ఉంచాలన్నారు. నైట్ బీట్, పెట్రోలింగ్ అధికారులు విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలన్నారు. సిబ్బంది వాహనాలు నడిపేటప్పుడు రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ సూచించారు.