నేరాలపై ఉక్కుపాదమే.. పోలీసులు బాధ్యతగా పని చేయాలి

నేరాలపై ఉక్కుపాదమే.. పోలీసులు బాధ్యతగా పని చేయాలి
  • యాక్సిడెంట్లు, చోరీల నివారణకు ప్రత్యేక చర్యలు
  • ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తాం
  • ‘వెలుగు' ఇంటర్వ్యూలో కామారెడ్డి ఎస్పీ రాజేష్  చంద్ర  

కామారెడ్డి​, వెలుగు : ‘జిల్లాలో జరుగుతున్న నేరాలపై ఉక్కుపాదం మోపుతాం.. యాక్సిడెంట్లు, చోరీల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం.. పోలీసులు బాధ్యతగా పని చేయాలి.. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తాం..’ అని కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఎస్పీ రాజేష్​చంద్ర అన్నారు. సోమవారం జిల్లా పోలీస్​ ఆఫీస్​లో ‘వెలుగు' ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు. 

వెలుగు : పోలీసు శాఖ పరంగా జిల్లాలో ఏ ఆంశాలకు ప్రయార్టీ ఇస్తారు..?

ఎస్పీ : శాంతి భద్రతలను కాపాడడం, ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తాం.. పోలీస్​ స్టేషన్​తో పాటు డివిజన్​, జిల్లా ఆఫీసుకు వచ్చిన ఫిర్యాదులను ఆన్​లైన్​ చేసి పరిష్కరిస్తాం.  యాక్సిడెంట్లు, చోరీల నివారణపై స్పెషల్​ ఫోకస్ పెడుతాం.  వాహనదారులు ట్రాఫిక్ రూల్స్​ పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం. 

వెలుగు : జిల్లాలో గంజాయి అమ్మకాలపై చర్యలు తీసుకుంటారా ?

ఎస్పీ : గంజాయి ఎక్కడెక్కడ అమ్ముతున్నారో తెలుసుకుని కఠిన చర్యలు తీసుకుంటాం. గంజాయి రవాణాపై స్పెషల్​ ఫోకస్​ పెడుతాం. 

బాధ్యతలు స్వీకరించిన  అనంతరం టౌన్​ పోలీస్​ స్టేషన్​ను  ఎస్పీ సందర్శించి కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కేంద్రంలో ముఖ్యమైన ఏరియాలను పరిశీలించారు.  ఎస్పీ వెంట ఏఎస్పీ చైతన్యారెడ్డి, టౌన్​ సీఐ చంద్రశేఖర్​రెడ్డి ఉన్నారు. జిల్లాలోని పోలీసు అధికారులు, సిబ్బంది ఎస్పీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.