విధుల్లో నిర్లక్ష్యం చేయొద్దు : ఎస్పీ రాజేశ్​చంద్ర

విధుల్లో నిర్లక్ష్యం చేయొద్దు : ఎస్పీ రాజేశ్​చంద్ర
  •  కామారెడ్డి ఎస్పీ రాజేశ్​చంద్ర

కామారెడ్డి టౌన్​, వెలుగు: పోలీసులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేయొద్దని ఎస్పీ రాజేశ్​చంద్ర హెచ్చరించారు.  బుధవారం కామారెడ్డి జిల్లా పోలీస్​ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఎస్పీ మాట్లాడారు.  ప్రతి పోలీస్​ స్టేషన్​ ఎస్​హెచ్​వోలతో మాట్లాడాలన్నారు. ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికి ప్రతి గ్రామానికి ఒక పోలీస్​ అధికారి ఉండేలా చూడాలన్నారు. 

రౌడీ, అనుమానితులపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు.  ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్యాంక్, ఏటీఎం, పెట్రోల్​ బంక్,  ప్రార్థన స్థలాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని స్థాయి అధికారులు దృష్టి సారించాలన్నారు.  సమావేశంలో ఏఎస్పీ చైతన్యారెడ్డి, అడిషనల్ ఎస్పీ అడ్మిన్​ కె. నరసింహ రెడ్డి, డీఎస్పీలు శ్రీనివాస్ రావు, సత్యనారాయణ, స్పెషల్ బ్యాచ్ ఇన్​స్పెక్టర్ తిరుపయ్య, డీసీఆర్బీ ఇన్​స్పెక్టర్​ మురళి, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.