బాధితులకు సత్వర న్యాయం అందేలా చూడాలి : ఎస్పీ సింధూశర్మ

బాధితులకు సత్వర న్యాయం అందేలా చూడాలి : ఎస్పీ సింధూశర్మ
  • ఎస్పీ సింధూశర్మ

లింగంపేట, వెలుగు: పోలీసు విధులు ప్రజలకు మరింత చేరువయ్యేలా ఉండాలని కామారెడ్డి ఎస్పీ సింధూశర్మ పేర్కొన్నారు. బుధవారం ఎస్పీ  నాగిరెడ్డిపేట పోలీస్​ స్టేషన్​ను  తనిఖీ చేశారు.   కేసులకు సంబంధించి రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..  బాధితులకు సత్వర న్యాయం అందేలా చూడాలన్నారు. 

పెండింగ్​ కేసులను త్వరగా పరిష్కరించాలన్నారు.   సిబ్బంది బాధ్యతాయుతంగా పని చేయాలని కొత్త టెక్నాలజీపై  అవగాహన కలిగి ఉండాలన్నారు.  డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ రవీందర్‌‌, ఎస్సై మల్లారెడ్డి ఉన్నారు.