కామారెడ్డి, వెలుగు: ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలనికామారెడ్డి ఎస్పీ సింధూశర్మ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా పోలీసు ఆఫీసులో నెలవారీ రివ్యూ మీటింగ్ జరిగింది. పోలీస్ స్టేషన్ల వారీగా నెల రోజుల్లో నమోదైన కేసులు, వాటి దర్యాప్తు వివరాలు ఆఫీసర్లను అడిగి తెలుసుకున్నారు.
పెండింగ్కేసుల గురించి ఆరా తీశారు. ఎస్పీ మాట్లాడుతూ.. కేసులలో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్పెంచి, దర్యాప్తు త్వరగా పూర్తిచేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పోలీస్పెట్రోలింగ్ను పెంచాలన్నారు. సైబర్క్రైంపై ప్రజలకు అవగాహన కల్పించాలని, రోడ్డు ప్రమాదాల నివారణపై ఫోకస్చేయాలన్నారు. టైపర్ రైటర్ట్రైనింగ్కంప్లీట్ చేసిన8 మంది మహిళా పోలీసులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ఎస్పీ నరసింహారెడ్డి, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.