రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలు సహకరించాలి

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలు సహకరించాలి

కామారెడ్డిటౌన్, వెలుగు : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల సహకారం అవసరమని ఎస్పీ ఎం.రాజేశ్​చంద్ర పేర్కొన్నారు.  మంగళవారం జిల్లా పోలీస్​ ఆఫీసులోని కమాండ్​ కంట్రోల్​ రూమ్​ను ఆయన పరిశీలించి మాట్లాడారు. ట్రాపిక్​ రూల్స్​ పాటించని వారిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించాలన్నారు. ట్రాఫిక్​ రూల్స్​ పాటించని వారికి ఫైన్లు వేస్తున్నామన్నారు.  

రోడ్డు ప్రమాదాలు తగ్గించే ఉద్దేశంతో పలు చర్యలు చేపడుతున్నామన్నారు. హైవేపై స్పీడ్​ లిమిట్​ 80 గా నిర్ణయించామన్నారు.  వెహికిల్స్​ నడిపించే వ్యక్తులు రూల్స్​ పాటించి సురక్షితంగా ఇంటికి చేరాలన్నారు. కలెక్టరేట్​ ఆఫీస్​ ఎదుట  ధర్నా  చౌక్​, కలెక్టరేట్ మెయిన్​ గేట్​ను ఎస్పీ  పరిశీలించారు.   ఏఎస్పీ చైతన్యారెడ్డి,  అడిషనల్ ఎస్పీ నరసింహరెడ్డి, రూరల్ సీఐ రామన్​ తదితరులు ఉన్నారు.