రేవంత్ ​రెడ్డి దిష్టిబొమ్మ దహనం : జూకంటి ప్రభాకర్​రెడ్డి

కామారెడ్డి టౌన్, భిక్కనూరు, వెలుగు: రైతు బంధు పథకాన్ని ఆపాలంటూ కాంగ్రెస్​ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడాన్ని నిరసిస్తూ గురువారం కామారెడ్డిలో, భిక్కనూరు మండలంలోనూ రామేశ్వరపల్లి, బస్వాపూర్, కాచాపూర్​తదితర గ్రామాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో టీపీసీసీ ప్రెసిడెంట్​ రేవంత్​రెడ్డి దిష్టిబొమ్మను  దహనం చేశారు. జిల్లాకేంద్రంలో జరిగిన నిరసనలో టౌన్ ప్రెసిడెంట్​జూకంటి ప్రభాకర్​రెడ్డి, యూత్ ​వింగ్ ​ప్రెసిడెంట్​ చెలిమెల భాను మాట్లాడుతూ.. పేదలకు లబ్ధి చేకూరుతుంటే ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయన్నారు. కార్యక్రమంలో భిక్కనూరు ఎంపీపీ గాల్​రెడ్డి, జడ్పీటీసీ పద్మ నాగభూషణంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.