ఇజ్రాయిల్‌‌‌‌లో ఉద్యోగాల పేరుతో  మోసం..17 లక్షలు వసూలు చేసి పరార్

ఇజ్రాయిల్‌‌‌‌లో ఉద్యోగాల పేరుతో  మోసం..17 లక్షలు వసూలు చేసి పరార్
  •     50 నుంచి 60 మంది వద్ద లక్షల్లో వసూలు

కామారెడ్డి, వెలుగు : ఇజ్రాయిల్‌‌‌‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేసి మోసం చేసిన ముగ్గురిని కామారెడ్డి టౌన్‌‌‌‌ పోలీసులు శనివారం అరెస్ట్‌‌‌‌ చేశారు. నిజామాబాద్‌‌‌‌ జిల్లా ఆర్మూర్‌‌‌‌కు చెందిన మీసాల కిరణ్, గుజ్జుల విజయ్, హైదరాబాద్‌‌‌‌కు చెందిన మహ్మద్‌‌‌‌ అలీ కామారెడ్డిలోని ఎన్‌‌‌‌జీవోస్‌‌‌‌ కాలనీలో డెక్కన్‌‌‌‌ అబ్రాడ్‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌‌ కన్సల్టెన్సీ పేరిట ఆఫీస్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ చేశారు. వివిధ ఉద్యోగాల కోసం ఇజ్రాయిల్‌‌‌‌ పంపిస్తామని నమ్మించి

50 నుంచి 60 మంది వద్ద రూ. 15 లక్షల నుంచి రూ. 17 లక్షలు వసూలు చేశారు. ఎవరినీ ఇజ్రాయిల్‌‌‌‌ పంపించకుండా ఆఫీస్‌‌‌‌ క్లోజ్‌‌‌‌ చేసి పారిపోయారు. ఓ బాధితుడు మే 15న కామారెడ్డి టౌన్‌‌‌‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు నిందితుల కోసం గాలింపు మొదలుపెట్టారు. కిరణ్‌‌‌‌, విజయ్‌‌‌‌, అలీ శనివారం కారులో కామారెడ్డి రావడంతో వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు కార్లు, ల్యాప్‌‌‌‌ట్యాప్‌‌‌‌, కంప్యూటర్‌‌‌‌, ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు టౌన్‌‌‌‌ సీఐ చంద్రశేఖర్‌‌‌‌రెడ్డి చెప్పారు.