కామేపల్లి, వెలుగు : లక్ష రూపాయల బీసీ సాయం కోసం కామేపల్లి ఎంపీడీఓ ఆఫీస్వద్ద పెట్రోల్బాటిల్తో ఆందోళనకు దిగిన ముచ్చర్ల గ్రామస్తుడు చల్లా వెంకటేశ్వర్లుకు చెక్కు అందింది. అర్హుల లిస్టులో తన పేరు ఉన్నా, చెక్కు ఇవ్వకపోవడంతో సోమవారం వెంకటేశ్వర్లు ఎంపీడీఓ ఆఫీస్వద్ద ఆందోళనకు దిగాడు.
వార్తా పత్రికల ద్వారా ఆ విషయాన్ని తెలుసుకున్న ఖమ్మం కలెక్టర్ స్పందించారు. వెంటనే బాధితుడికి చెక్కు అందజేయాలని ఆదేశించారు. దీంతో మండల అధికారులు మంగళవారం వెంకటేశ్వర్లుకు చెక్కు అందజేశారు. వెంకటేశ్వర్లు వెంట కాంగ్రెస్లీడర్లు ఉన్నారు.