పాల్వంచ, వెలుగు : బీఎస్పీ తరఫున కొత్తగూడెం అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న యెర్రా కామేశ్గురువారం వినూత్నంగా ప్రచారం చేశారు. టౌన్‌లోని రాజీవ్ గాంధీ మార్కెట్ మటన్కొట్టారు. చేపలు, కూరగాయలు అమ్మి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
తనను గెలిపిస్తే సర్వే నంబర్లు 817, 727, 999, 444లో రిజిస్ట్రేషన్లు పునరుద్ధరిస్తానని చెప్పారు. పాల్వంచ మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగేలా చేస్తానన్నారు. ఆయన వెంట బీఎస్పీ పట్టణ అధ్యక్షుడు కోళ్లపూడి ప్రవీణ్, పార్టీ నాయకులు ఉన్నారు.