
ఐపీఎల్ లో అరుదైన సీన్ చోటు చేసుకుంది. శ్రీలంక పార్ట్ టైమ్ బౌలర్ కామిందు మెండీస్ ఒక్కసారిగా అందరినీ షాక్ కు గురి చేశాడు. ఈడెన్ గార్డెన్ వేదికగా గురువారం (ఏప్రిల్ 3) కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ బ్యాటర్ కామిందు మెండీస్ తుది జట్టులో చోటు సంపాదించాడు. తొలి ఇన్నింగ్స్ లో కోల్‌కతా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కమ్మిన్స్ ఆశ్చర్యకరంగా మెండీస్ ను బౌలింగ్ కు తీసుకొని వచ్చాడు. అయితే ఈ లంక స్పిన్నర్ మాత్రం అందరికీ షాక్ ఇచ్చాడు.
రెండు చేతులతో బౌలింగ్ చేసి ఔరా అనిపించాడు. అంతేకాదు అంగ్‌క్రిష్ రఘువంశీ వికెట్ తీశాడు. దీంతో ఐపీఎల్ లో మెండీస్ అరుదైన ఘనతను అందుకున్నాడు. రెండు చేతులతో బౌలింగ్ చేసి ఐపీఎల్ లో వికెట్ తీసుకున్న తొలి ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. రైట్ హ్యాండర్ బ్యాటర్స్ కు అతను లెఫ్టర్మ్ ఆర్థోడాక్స్‌తో బౌలింగ్ చేశాడు. అదే విధంగా లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్లకు రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేశాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అతని బౌలింగ్ యాక్షన్ రెండు చేతులతో కూడా ఒకేలా ఉంది. ఈ మ్యాచ్ లో ఒకే ఓవర్ వేసిన మెండీస్ నాలుగు పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ అజింక్య రహానే, అంగ్క్రిష్ రఘువంశీ భాగస్వామ్యానికి తోడు వెంకటేష్ అయ్యర్ (29 బంతుల్లో 60:7 ఫోర్లు, 3 సిక్సర్లు), రింకూ సింగ్ (32) మెరుపులు మెరిపించారు. సన్ రైజర్స్ బౌలర్లలో షమీ, కమ్మిన్స్, జీషాన్ అన్సారీ, మెండీస్, హర్షల్ పటేల్ తలో వికెట్ తీసుకున్నారు.
KAMINDU MENDIS BOWLING WITH BOTH HANDS IN IPL 🤯🔥 pic.twitter.com/fLbM1NUK4u
— Johns. (@CricCrazyJohns) April 3, 2025