SL vs NZ 2024: 8 టెస్టుల్లోనే 1000 పరుగులు.. బ్రాడ్ మన్ సరసన కామిందు మెండీస్

SL vs NZ 2024: 8 టెస్టుల్లోనే 1000 పరుగులు.. బ్రాడ్ మన్ సరసన కామిందు మెండీస్

శ్రీలంక మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కామిందు మెండీస్ టెస్ట్ క్రికెట్ లో అస్సలు తెగ్గేదే లేదంటున్నాడు. టెస్ట్ క్రికెట్ లో నిలకడకు మారుపేరుగా దూసుకుపోతున్నాడు. 8 టెస్టుల్లోనే ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకుంటున్నాడు. గాలే వేదికగా న్యూజిలాండ్ పై జరుగుతున్న రెండో టెస్ట్ తొలి రోజు ఆటలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని టెస్టు క్రికెట్ చరిత్రలో ఆడిన తొలి 8 టెస్టుల్లో 50కి పైగా స్కోర్ చేసిన తొలి బ్యాటర్ గా చరిత్ర సృష్టించాడు. 

ఇదే క్రమంలో కేవలం 13 ఇన్నింగ్స్ ల్లో 1000 పరుగులను పూర్తి చేసుకొని ఆస్ట్రేలియా ఆల్ టైం బెస్ట్ ప్లేయర్ సర్ డాన్ బ్రాడ్ మన్ సరసన చేరాడు. బ్రాడ్ మన్ 1000 పరుగులు చేయడానికి కేవలం 13 ఇన్నింగ్స్ లు అవసరం కాగా.. మెండీస్ ఆ రికార్డ్ సమం చేశాడు. ఓవరాల్ గా ఈ రికార్డ్ ఇంగ్లాండ్ ఆటగాడు హెర్బర్ట్ సట్‌క్లిఫ్, వెస్టిండీస్ ఆటగాడు ఎవర్టన్ వీక్స్ పేరిట ఉంది. ఇద్దరు 12 ఇన్నింగ్స్ ల్లో 1000 పరుగులను పూర్తి చేసుకున్నారు. 

ALSO READ | IND vs BAN 2024: వరుణిడిదే విజయం.. 35 ఓవర్లతో ముగిసిన తొలి రోజు

ఈ మ్యాచ్ లో మొత్తం 182 పరుగులు చేసిన కామిందు మెండీస్ అజేయంగా నిలిచాడు. అతను డబుల్ సెంచరీ కొట్టకుండానే శ్రీలంక  ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. కామిందు మెండీస్ భారీ సెంచరీకి తోడు కుశాల్ మెండీస్(106) చండీమల్ (116) సెంచరీలు చేయడంతో గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో 5 వికెట్ల నష్టానికి 602 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.