ENG vs SL 2024: ఇంగ్లీష్ గడ్డపై మెండీస్ సెంచరీ.. తొలి లంక బ్యాటర్‌గా సరికొత్త చరిత్ర

ENG vs SL 2024: ఇంగ్లీష్ గడ్డపై మెండీస్ సెంచరీ.. తొలి లంక బ్యాటర్‌గా సరికొత్త చరిత్ర

సాధారణంగా ఇంగ్లాండ్ గడ్డపై టెస్టు మ్యాచ్ అంటే ప్రత్యర్థి  బ్యాటర్లు బెంబేలెత్తిపోతారు. అత్యద్భుతంగా ఆడితే తప్ప ఎంతటి స్టార్ బ్యాటర్ అయినా స్వదేశంలో ఇంగ్లీష్ బౌలర్ల దెబ్బకు బలి కావాల్సిందే. ఇక ఆసియా జట్లయితే టెస్టుల్లో ఇంగ్లాండ్ గడ్డపై రాణించడం శక్తికి మించిన పని. అయితే వీటన్నిటిని పటాపంచలు చేస్తూ శ్రీలంక బ్యాటర్ కామిందు మెండీస్ సెంచరీతో మెరిశాడు. ఇంగ్లాండ్ బౌలర్లను సమర్ధవంతంగా అడ్డుకుంటూ కొరకరాని కొయ్యలా తయారయ్యాడు. 

మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో నాలుగో రోజు ఆటలో భాగంగా కామిందు మెండీస్ 175 బంతుల్లో 12 ఫోర్లు.. ఒక సిక్సర్ తో 101పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో ఏడో స్థానంలో ఇంగ్లాండ్ గడ్డపై సెంచరీ చేసిన తొలి శ్రీలంక బ్యాటర్ గా మెండీస్ చరిత్ర సృష్టించాడు. మెండీస్ ఇన్నింగ్స్ తో శ్రీలంక రెండో ఇన్నింగ్స్ లో ప్రస్తుతం 6 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. క్రీజ్ లో మెండీస్ (101), చండీమల్ (62) ఉన్నారు.

ALSO READ | PAK vs BAN 2024: తృటిలో డబుల్ సెంచరీ మిస్.. పాక్ బౌలర్లను వణికించిన రహీమ్

శ్రీలంక లంచ్ నాలుగో రోజు లంచ్ సమయానికి 169 పరుగుల ఆధిక్యంలో ఉండగా..మరో రోజు ఆట మిగిలి ఉంది. అంతకముందు శ్రీలంక 236 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 358 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంగ్లాండ్ కు తొలి ఇన్నింగ్స్ లో 122 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.