
శ్రీలంక యువ ఆల్ రౌండర్ కమిండు మెండిస్ కీలక మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. ప్లే ఆఫ్స్ రేస్ లో నిలబడాలంటే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ శుక్రవారం (ఏప్రిల్ 25) చెన్నై సూపర్ కింగ్స్ పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో కమిందు మెండిస్ తన లా రౌండ్ షో తో అదరగొట్టాడు. ముందుగా బౌలింగ్ లో జడేజాను క్లీన్ బౌల్డ్ చేసిన ఈ లంక ఆల్ రౌండర్.. ఆ తర్వాత ఒక అద్భుతమైన క్యాచ్ తో ప్రమాదకరంగా మారుతున్న బ్రేవీస్ ను పెవిలియన్ కు పంపాడు.
బ్యాటింగ్ లోనూ 22 బంతుల్లోనే 32 పరుగులు చేసి హైదరాబాద్ జట్టుకు విజయాన్ని అందించాడు. నిన్న జరిగిన మ్యాచ్ లో మెండీస్ ఒక్కసారిగా సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించాడు. రెండ్ చేతులతో బౌలింగ్ చేయడమే కాకుండా ఒక స్టన్నింగ్ క్యాచ్ అందుకొని ఔరా అనిపించాడు. ఐపీఎల్ లో సత్తా చాటాలనే తన కళను నెరవేర్చుకోవడం కోసం మెండిస్ తన హానీ మూన్ ను త్యాగం చేసినట్టు తెలుస్తుంది. ఇటీవలే మెండిస్ వివాహం జరిగింది. తన చిరకాల స్నేహితురాలు నిష్నిని మార్చి 2025లో అతను వివాహం చేసుకున్నాడు. గత సంవత్సరం నిశ్చితార్థం తర్వాత ఈ ఏడాది పెళ్లి చేసుకున్నాడు.
వివాహం తర్వాత కామిందు అతని భార్య నిష్ని శ్రీలంకలోని అందమైన ప్రదేశాలలో తమ హనీమూన్‌ను ఆస్వాదించారు. అయితే ఐపీఎల్ మెగా ఆక్షన్ కోసం అతను సన్ రైజర్స్ జట్టులో చేరాల్సి రావడంతో ఈ జంట విదేశీ పర్యటనకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారట. హనీమూన్ కంటే క్రికెట్‌కు ప్రాధాన్యత ఇవ్వాలనే అతని నిర్ణయాన్ని అభిమానులు ప్రశంసించారు. మెండిస్ కు క్రికెట్ పట్ల ఉన్న అంకిత భావాన్ని తెలియజేస్తుంది. 2025 ఐపీఎల్ మెగా ఆక్షన్ లో కామిందు మెండీస్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రూ. 75 లక్షలకు జట్టులోకి తీసుకుంది.