![కర్నూలులో కామినేని హాస్పిటల్స్](https://static.v6velugu.com/uploads/2023/01/Kamineni-Hospitals-opened-a-hospital-in-Kurnool_whuS0szGbm.jpg)
హైదరాబాద్, వెలుగు: కామినేని హాస్పిటల్స్ కర్నూలులో హాస్పిటల్‌ను ప్రారంభించింది. జెమ్‌కేర్ కామినేని హాస్పిటల్స్ పేరుతో రూ.150 కోట్లతో దీన్ని ఏర్పాటు చేశారు. ఇందులో 150 బెడ్స్ ఉన్నాయి. ఇదే ఏడాది రూ. 75 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్‌తో 75 బెడ్‌ల సామర్థ్యం ఉన్న క్యాన్సర్ ట్రీట్‌మెంట్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేయాలని ఈ సంస్థ చూస్తోంది. కార్డియాక్, న్యూరో, అనస్తీషియా, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, మెడికల్ వంటి విభాగాలు ఉంటాయి.