బీఆర్ఎస్ లో చేరిన జీవన్

ఖమ్మం టౌన్,వెలుగు: టీడీపీ స్టేట్ జనరల్ సెక్రటరీ, ఖమ్మం కమ్మ మహాజన సంఘం జిల్లా సెక్రటరీ తాళ్లూరి జీవన కుమార్ శనివారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కండువా కప్పి  పార్టీలోకి ఆహ్వానించారు. నగరంలోని 31వ డివిజన్ ప్రధాన కార్యదర్శి వెల్లంపల్లి వెంకట సుబ్బారావు తిరిగి గులాబీ గూటికి చేరుకున్నారు.

అలాగే ఖమ్మం మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు సింగు శ్రీనివాస్ తో పాటు 100 కుటుంబాలు శనివారం పార్టీలో చేరాయి.  బ్రాహ్మణ బజార్ లో సర్వదేవభట్ల అనంతరామం  ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో, వీడీఓఎస్ కాలనీలోని ఓ ప్రైవేట్ హోటల్ లో పార్టీ లీగల్ సెల్ అధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో  పువ్వాడ  పాల్గొన్నారు.  కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ,  పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధు,  ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, నాయకులు పాల్గొన్నారు.