కాంట్రాక్టీకరణ ఆగాలంటే ఐఎన్టీయుసీ రావాలి

నస్పూర్, వెలుగు: సింగరేణి సంస్థలో కాంట్రాక్టీకరణ ఆగాలంటే ఐఎన్టీయూసీ రావాలని ఆ సంఘం కేంద్ర ఉపాధ్యక్షుడు కాంపెల్లి సమ్మయ్య, శంకర్ రావు అన్నారు. గురువారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే7 గనిపై జరిగిన గేట్ మీటింగ్​లో మాట్లాడారు. మొన్నటి వరకు గుర్తింపు కార్మిక సంఘంగా ఉన్న టీబీజీకేఎస్ నాయకుల వైఫల్యాలు, అవినీతి అక్రమాల మూలంగానే సింగరేణి సంస్థకు,  కార్మికులకి తీరని అన్యాయం జరిగిందన్నారు.

సింగరేణిలో విచ్చలవిడిగా పెరిగిన కాంట్రాక్టీకరణను ఆపాలంటే గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ఐఎన్టీయుసీని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ,  టీబీజీకేస్ యూనియన్ల నుంచి 100 మంది కార్మికులు ఐఎన్టీయూసీలో చేరారు. ఈ కార్యక్రమంలో స్థానిక లీడర్లు కలవేణి శ్యామ్, గరిగె స్వామి, తిరుపతి రెడ్డి, భీం రావు, సమ్ము రాజయ్య, రాఘవరెడ్డి, ఎల్.శ్రీనివాస్, సమ్మిరెడ్డి, మహేశ్, కొలిపాక సమ్మయ్య, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.