Champions Trophy 2025: మా జట్టు దండగ.. జింబాబ్వే, ఐర్లాండ్‌తో సిరీస్ పెట్టండి: పాక్ మాజీ ఓపెనర్

Champions Trophy 2025: మా జట్టు దండగ.. జింబాబ్వే, ఐర్లాండ్‌తో సిరీస్ పెట్టండి: పాక్ మాజీ ఓపెనర్

ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో పాకిస్థాన్ చిత్తుగా ఓడిపోయింది. బుధవారం (ఫిబ్రవరి 19) కరాచీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో 60 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో పాకిస్థాన్ క్రికెట్ జట్టుపై ఆ దేశం తీవ్ర విమర్శలు చేస్తుంది. ఫ్యాన్స్ నుంచి ఎక్స్ పర్ట్స్ వరకు పాక్ ఆట తీరుపై మండిపడుతున్నారు. 29 ఏళ్ళ తర్వాత తమ దేశంలో ఐసీసీ టోర్నీ నిర్వహించిందనే ఆనందంలో ఉండగానే తొలి మ్యాచ్ లో ఘోర పరాజయం ఆ దేశ ఫ్యాన్స్ ను బాధకు గురి చేస్తుంది. 

న్యూజిలాండ్ పై ఓటమి అనంతరం పాకిస్థాన్ మాజీ ఓపెనర్ కమ్రాన్ అక్మల్ తమ జట్టును తీవ్రంగా విమర్శించాడు. జింబాబ్వే, ఐర్లాండ్ వంటి చిన్న జట్లతో సిరీస్ ఆడాలని పాకిస్తాన్‌కు కమ్రాన్ అక్మల్ సలహా ఇచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ ఒక్క ఆట కూడా గెలవదని అక్మల్ అంచనా వేశాడు. గ్రూప్ దశలో ఒక్క విజయం  సాధించినా వారు అదృష్టవంతులు అని  తెలిపాడు. ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ ఏ దశలోనూ గెలుపు కోసం ప్రయత్నించలేదు. ఓపెనర్ సౌద్ షకీల్, కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్, బాబర్ అజామ్ జిడ్డు బ్యాటింగ్ తో 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 22 పరుగులు చేసి కష్టాల్లో పడింది. 

Also Read :- బంగ్లాదేశ్ బ్యాటింగ్.. అర్షదీప్‌కు నో ఛాన్స్

 పవర్ ప్లే తర్వాత బాబర్ అజామ్, ఫకర్ జమాన్ బ్యాట్ ఝుళిపించడంలో విఫలమయ్యారు. దీంతో పాక్ ఓటమి ఖరారైంది. బాబర్ 90 బంతుల్లో 64 పరుగులు చేసినా వేగంగా ఆడడంలో విఫలమయ్యాడు. సల్మాన్ (28 బంతుల్లో 42) మెరుపు ఇన్నింగ్స్.. కుష్దిల్‌  షా (69) హాఫ్‌‌‌‌ సెంచరీ చేసినా ఫలితం లేకపోయింది.  కివీస్ భారీ ఓటమితో పాకిస్థాన్ డేంజర్ జోన్ లో పడింది. ఆదివారం (ఫిబ్రవరి 23) భారత్ తో జరగబోయే లీగ్ మ్యాచ్ లో ఓడిపోతే టోర్నీ నుంచి దాదాపుగా నిష్క్రమిస్తుంది. దీంతో ఈ మ్యాచ్ పాక్ కు చావో రేవో లాంటిది. టాస్‌‌‌‌ ఓడి బ్యాటింగ్‌‌‌‌కు దిగిన న్యూజిలాండ్‌‌‌‌ 50 ఓవర్లలో 320/5 స్కోరు చేసింది. ఛేజింగ్‌‌‌‌లో పాకిస్తాన్‌‌‌‌ 47.2 ఓవర్లలో 260 రన్స్‌‌‌‌కే ఆలౌటై ఓడింది.