PAK vs SA: ఛీ ఛీ.. బండబూతు.. సఫారీ క్రికెటర్లను దుర్భాషలాడిన పాక్ బ్యాటర్

PAK vs SA: ఛీ ఛీ.. బండబూతు.. సఫారీ క్రికెటర్లను దుర్భాషలాడిన పాక్ బ్యాటర్

క్రికెట్ ప్రపంచంలో అన్ని జట్లది ఓ లెక్కయితే.. దాయాది దేశం పాకిస్థాన్‌ది మరో లెక్క. ఆటలోనే కాదు.. వ్యవహార శైలిలోనూ ఆ జట్టు ఆటగాళ్లు ఎవరికీ అంతుపట్టరు. వారిలో వారు తిట్టుకోవడం.. ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లపై నోరుపారేసుకోవడం సదా మామూలే. తాజాగా అలాంటి పని మరోసారి చేసి.. మేం మారం.. మేమింతే అని నిరూపించారు.

ఏం జరిగిందంటే..?

సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ జట్ల మధ్య తొలి టెస్ట్ జరుగుతోంది. ఈ టెస్టులో పాక్‌ ఇన్నింగ్స్‌ 31వ ఓవర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ ఓవర్‌లోని రెండో బంతిని రబాడ వేయబోగా.. కమ్రాన్ గులామ్ ఆలస్యంగా స్పందించాడు. బంతిని ఎదుర్కోకుండా వెనక్కి వెళ్ళిపోయాడు. ఇది దక్షిణాఫ్రికా స్పీడ్‌స్టర్ రబడాకు ఆగ్రహాన్ని తెప్పించింది. కోపంగా గులామ్‌వైపు గుర్రుగా చూశాడు. అందుకు ప్రతిస్పందనగా కమ్రాన్.. కవ్వింపు చర్యలకు పాల్పడ్డాడు. ఆ సమయంలో సఫారీ వికెట్ కీపర్ వెఱ్ఱియెన్నే సర్దిచెప్పే ప్రయత్నం చేయగా.. అతన్ని దూషించాడు.

Also Read :- ముగిసిన రెండోరోజు ఆట.. ఆ ఇద్దరిపైనే టీమిండియా ఆశలు

"F**K YOU" అంటూ రబడా, వెఱ్ఱియెన్నేలను పాక్ బ్యాటర్ అసభ్య పదజాలంతో దూషించాడు. పదే పదే అదే పదజాలాన్ని రిపీట్ చేశాడు. క్రికెట్‌లో స్లెడ్జింగ్ సర్వసాధారణమే కానీ, పాక్ బ్యాటర్ నోటిదూల వివాదానికి దారితీస్తోంది. సఫారీ అభిమానులు పాక్ ఆటగాళ్ల వ్యహారశైలిపై ఫ్లకార్డులతో నిరసన తెలుపుతున్నారు. బూతులు మాట్లాడుతూ జెంటిల్మన్ గేమ్‌కు అప్రతిష్ట తీసుకురావొద్దంటూ చీవాట్లు పెడుతున్నారు.