హుజూరాబాద్, వెలుగు: రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీని బొంద పెడతామని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా చైర్మన్ కనకం కుమారస్వామి పేర్కొన్నారు. మంగళవారం హుజూరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటాలు చేసిన ఉద్యమకారులకు బీఆర్ఎస్ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందన్నారు.
అధికారంలో ఉన్న 10 ఏండ్ల పాలనలో ఏనాడూ ఉద్యమకారులను పట్టించుకోకుండా.. అధికారం పోయాక మరోసారి ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. సమావేశంలో ఉద్యమకారుల ఫోరం నాయకులు ఊకంటి మల్లాచార్యులు, మల్లేశ్, సంతోష్, సదానందం, అంకుస్, సాగర్, శంకర్, అఫ్జల్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.