kantara Release Date: కాంతార నుంచి బిగ్ అప్డేట్... అది లేదంటూ క్లారిటీ..

kantara Release Date: కాంతార నుంచి బిగ్ అప్డేట్... అది లేదంటూ క్లారిటీ..

కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ, డైరెక్ట్ చేస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ "కాంతార చాప్టర్ 1" సినిమా కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే గతంలో వచ్చిన కాంతార సినిమాపై బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో హీరో రిషబ్ శెట్టి కూడా కాస్త టైమ్ తీసుకుని మరీ మంచి క్వాలిటీ కంటెంట్ ని అందించాడనికి ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో కాంతార చాప్టర్ 1 రిలీజ్ వాయిదా పడుతుందని కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో మేకర్స్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.

ఇందులో భాగంగా "నో డౌట్స్, నో డిలే" అంటూ క్లారిటీ ఇచ్చింది. అలాగే ఓ వీడియోని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ తదితర భాషల్లో కాంతార చాప్టర్ 1 సినిమా రిలీజ్ వాయిదా పడటం లేదని అనుకున్న సమయానికి రిలీజ్ చేస్తున్నామని తెలిపారు. దీంతో కాంతార మూవీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Also Read : ఒక్క కేసు ఎన్నో ట్విస్టులు.. ఓటీటీలోకి తెలుగు కోర్ట్ రూమ్ డ్రామా

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kantara (@kantarafilm)

ఈ విషయం ఇలా ఉండగా కాంతార చాప్టర్ 1 గాంధీ జయంతి సందర్భంగా ఈ ఏడాది అక్టోబర్ 02న పాన్ ఇండియా భాషలలో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాని రిషబ్ శెట్టి బడ్జెట్ కి ఏమాత్రం వెనుకాడకుండా హాలీవుడ్ టెక్నీషియన్స్ తో తెరకెక్కిస్తున్నాడు. దీంతో ఇంగ్లీష్ లో కూడా డబ్ చేసి రిలీజ్ చేసియడానికి ప్లాన్ చేస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి.