OTTలోకి వచ్చేసిన శివరాజ్ కుమార్ బ్లాక్ బస్టర్ సినిమా.. ఎక్కడ చూడాలంటే.?

OTTలోకి వచ్చేసిన శివరాజ్ కుమార్ బ్లాక్ బస్టర్ సినిమా.. ఎక్కడ చూడాలంటే.?

కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ నటించిన "భైరతి రణగల్" కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమాకి ప్రముఖ కన్నడ దర్శకుడు నర్తన్ దర్శకత్వం వహించగా రాహుల్ బోస్, రుక్మిణి వసంత్, దేవరాజ్, ఛాయా సింగ్, మధు గురుస్వామి, షబీర్ కల్లారక్కల్, మరియు బాబు హిరన్నయ్య తదితరులు నటించారు. గీతా పిక్చర్స్ బ్యానర్‌పై గీతా శివ రాజ్‌కుమార్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం రవి బస్రూర్ సంగీతం అందించాడు.

ఈ సినిమా గత ఏడాది కన్నడలో నవంబర్ 15, 2024న విడుదలైంది. ఆ ఆతర్వాత తెలుగులో కూడా డబ్ చేసి నవంబర్ 29, 2024న రిలీజ్ చేశారు. కానీ పుష్ప 2: ది రూల్ థియేటర్స్ లో ఉండటంతో ఈ సినిమాకి పెద్దగా కలెక్షన్స్ రాలేదు తెలుగులో. భైరతి రణగల్ సినిమా ఇప్పుడు ఓటిటిలోకి వచ్చేసింది. ఈ క్రమంలో తెలుగు వెర్షన్ ప్రముఖ తెలుగు ఓటిటి అయిన ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. కన్నడ వెర్షన్ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో ప్రసారమవుతోంది. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అభిమానులకి తెలియజేశారు.

ALSO READ | Laila: వెయ్యి థియేటర్లలో లైలా మూవీ : టికెట్ల బుకింగ్స్ పై అందరిలో ఆసక్తి

ఈ విషయం ఇలా ఉండగా ఈ సినిమాలో నటించిన తర్వాత శివరాజ్ కుమార్ క్యాన్సర్ చికిత్స కోసం విదేశాలకి వెళ్ళాడు. ఇటీవలే ఆపరేషన్ తర్వాత తిరిగి వచ్చాడు. కొంతకాలం విశ్రాంతి తర్వాత రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న RC16 సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లు సమాచారం.