
కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై హైకోర్టులో విచారణ జరిగింది. స్వచ్ఛంద సంస్థలు వేసిన పిటిషన్ ను ఏప్రిల్ 7న విచారించింది హైకోర్టు.. ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందన్న డివిజన్ బెంచ్.. కౌంటర్ , రిపోర్ట్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 24కు వాయిదా వేసింది.
కంచ గచ్చిబౌలి భూముల్లో పనులను ఆపేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏప్రిల్ 3న సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అక్కడ ఎలాంటి కార్యకలాపాలు చేపట్టొద్దని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో నెల రోజుల్లో నిపుణుల కమిటీని వేసి, ఆరు నెలల్లో రిపోర్ట్ సమర్పించాలని పేర్కొంది. కంచ గచ్చిబౌలి ప్రాంతాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పరిశీలించాలని, ఏప్రిల్ 16లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. తమ ఆదేశాలను పాటించకపోతే.. సీఎస్ వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది.
మరో వైపు కంచ గచ్చి బౌలి భూముల పరిష్కారం కోసం కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం .. ఎవరైనా ప్రవేశించినా చట్టరీత్యా చర్యలు తప్పవని పేర్కొన్నారు పోలీసులు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించినా , అల్లర్లు చేసినా , విధినిర్వహణకు భంగం కలిగించేలా వ్యవహరించినా చర్యలు తీసుకుంటామంటామని తెలిపారు పోలీసులు.