ఐటీ హబ్‌లో 3,600 మందికి ఉద్యోగాలు: కంచర్ల భూపాల్ రెడ్డి

నల్గొండ అర్బన్​, వెలుగు: నల్గొండ టౌన్​లో త్వరలో ప్రారంభంకానున్న ఐటీ హబ్ సెంటర్​లో 3,600 మంది ఉద్యోగాలు లభిస్తాయని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్​ రెడ్డి తెలిపారు. శుక్రవారం లక్ష్మీగార్డెన్స్​లో ఏర్పాటు చేసిన జాబ్​ మేళాను ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఇప్పటి వరకు 15 కంపెనీలు ముందుకొచ్చాయని, మరో  50 కంపెనీలు కూడా ఆసక్తిగా ఉన్నాయని చెప్పారు.  

మంత్రులు జగదీశ్‌​ రెడ్డి, కేటీఆర్​ చొరవతో జిల్లాలో  రూ.95 కోట్లతో ఐటీ హబ్​సెంటర్​ ఏర్పాటు చేశామని చెప్పారు.  జాబ్‌ మేళాలో 15,316 మంది అప్లై చేసుకోగా.. 3,216 మందిని అర్హులుగా ఎంపిక చేసినట్లు తెలిపారు.  వీరికి జీఎస్సార్​, కేబీకే, బీసీడీసీ క్లౌడ్​ కంపెనీల్లో ప్లేస్‌మెంట్‌ ఇస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్​ హేమంత్​ కేశవ్​ పాటిల్, మున్సిపల్​ చైర్మన్​ మందడి సైదిరెడ్డి రెడ్డి, వైస్​ చైర్మన్​ అబ్బగోని రమేశ్​ గౌడ్​ తదితరులు పాల్గొన్నారు.