గురుకుల విద్యకు ఫుల్ డిమాండ్ : కంచర్ల భూపాల్ రెడ్డి

నల్గొండ అర్బన్, వెలుగు : రాష్ట్రంలో  గురుకుల విద్యకు డిమాండ్ బాగా పెరిగిందని,  సీట్ల కోసం ఎమ్మెల్యే స్థాయిలో రికమండేషన్ లెటర్ ఇవ్వాల్సి వస్తోందని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి చెప్పారు.  గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్ , ట్రస్మా నల్లగొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్ లో ఆదివారం నిర్వహించిన విద్యా మహోత్సవం–2023 కార్యక్రమానికి చీఫ్ గెస్టుగా హాజరయ్యారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి గురుకుల, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల   బలోపేతానికి కృషి చేస్తోందన్నారు.   గురుకులాల్లో ఒక్కొక్క విద్యార్థిపై  ప్రభుత్వం ఏటా రూ. 1.20 లక్షలు ఖర్చు చేస్తోందని చెప్పారు.  అనంతరం 10 జీపీ సాధించిన ప్రభుత్వ విద్యార్థులకు రూ. 10 వేల చొప్పున అందించారు. అలాగే స్కూళ్లలో ఫస్ట్‌‌ వచ్చిన  విద్యార్థులకు  ప్రతిభా పురస్కారాలు, నీట్, జేఈఈ లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు జ్ఞాపిక, ప్రశంసా పత్రం అందజేశారు.  

అలాగే టెన్త్‌‌లో  వంద శాతం ఉత్తీర్ణత సాధించిన 100 మంది హెచ్‌‌ఎంలకు జ్ఞాపిక,  ప్రశంసా పత్రం ఇచ్చి శాలువాతో సన్మానించారు.  ఈ కార్యక్రమంలో గాంధీ సంస్థల చైర్మన్ గున్న రాజేందర్ రెడ్డి, డిగ్రీ, పీజీ కాలేజీల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసాద్,  గాంధీ జ్ఞానం ప్రతిష్ట ప్రధాన కార్యదర్శి యానాల ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పంకజ్ యాదవ్, విద్యావేత్త ఎం వీ గోనా రెడ్డి, ట్రస్మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంట్ల  అనంతరెడ్డి, ఎంఈవో కత్తుల అరుంధతి, జిల్లా కామన్ పరీక్షల బోర్డు కార్యదర్శి, గెజిటెడ్ హెడ్మాస్టర్ల జిల్లా అధ్యక్షుడు కొమ్ము శ్రీనివాస్, బీఆర్‌‌‌‌ఎస్ నేత కటకం సత్తయ్య గౌడ్ పాల్గొన్నారు.