పిల్లలకు విషమిచ్చి చంపిన తల్లిదండ్రులు ఆత్మహత్య

మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.  అంకన్నగూడెం గ్రామంలో కొద్ది రోజుల క్రితం ఇద్దరు కూతుళ్లుకు విషం ఇచ్చి చంపి పరారైన తల్లిదండ్రులు కందగట్ల అనిల్- దేవి దంపతులు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అనిల్- దేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు ( లాస్య (2), లోహిత (2నెలలు) ). కుటుంబ కలహాతో వారు  గతనెల మార్చి 10వ తేదీన  తమ పిల్లలిద్దరికీ పురుగుల మందు తాగించి  హత్య చేసి పరారయ్యీరు.  ఇప్పుడు స్థానిక ఆడవిలో  ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.  కుళ్ళిపోయిన మృత దేహాలను పోలీసులు లభ్యం చేసుకున్నారు.  దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.