ఖమ్మం రూరల్, వెలుగు : గిరిజనుల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ఎంతో కృషి చేశారని, అందులో భాగంగానే తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశారని పాలేరు బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి చెప్పారు. తిరుమలాయపాలెంలో మండలం బచ్చోడు, పిండిప్రోలు గ్రామాల్లో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు.
500 జనాభా ఉన్న ప్రతి తండాను కేసీఆర్ ముందు చూపుతో పంచాయతీలుగా చేశారని తెలిపారు. ప్రజలందరూ తనను ఆదరించి మరోసారి గెలిపించాలని కోరారు. కందాల తన మనుమడు ప్రద్యున్, గిరిజనులతో కలిసి డ్యాన్స్చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే బాణోత్ చంద్రావతి తదితరులు పాల్గొన్నారు.
ALSO READ : కల్వకుంట్ల కుటుంబానికి చరమగీతం పాడాలి: కోరం కనకయ్య