మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి. తుమ్మల బలమైన నాయకుడు అయితే 2018 ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారని కందాల ప్రశ్నించారు. గోదావరి జలాలకు తమ్మలకు రాజకీయానికి సంబంధమేంటన్నారు.
ఖమ్మం జిల్లాకు తుమ్మల చేసిందేమీ లేదన్న కందాల ... గోదావరి నదిపై లిప్ట్ ప్రతిపాదన ఎప్పటినుంచో ఉందని చెప్పారు. తన వెనుక సీఎం ఉన్నారని, పాలేరులో బీఆర్ఎస్ గెలుస్తుందని కందాల ధీమా వ్యక్తం చేశారు. పాలేరులో ఎంతమంది పోటీ చేసిన అధికార పార్టీ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు.
ALSO READ: తెలంగాణలో మాత్రమే అనేక పథకాలున్నయ్: ఎర్రబెల్లి దయాకర్‌రావు
కాగా కేసీఆర్ ఫస్ట్ కేబినేట్లో మంత్రిగా చేసిన తుమ్మల.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కందాల ఉపేందర్ రెడ్డిపై ఓడిపోయారు. ఆ తరువాత బీఆర్ఎస్ లోకి కందాల చేరారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే కందాలకే సీఎం కేసీఆర్ టికెట్ కేటాయించడంతో తుమ్మల కాంగ్రెస్ లో చేరుతారంటూ ప్రచారం నడుస్తో్ంది.