దివ్యాంగులకు ఆర్థిక భరోసా కల్పించాం : కందాల ఉపేందర్ రెడ్డి

కూసుమంచి, వెలుగు :  దివ్యాంగులకు ఆర్థిక భరోసా కల్పించింది కేసీఆర్ ప్రభుత్వమేనని పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి తెలిపారు. గురువారం కూసుమంచి మండలంలోని జీళ్ల చెరువు గ్రామంలోని ఓ ఫంక్షన్ హాల్​లో నిర్వహించిన దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. పాలేరు ఎమ్మెల్యేగా తనను మరోసారి గెలిపిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ తన కుటుంబ సభ్యులేనన్నారు.

రాష్ట్ర దివ్యాంగుల చైర్మన్ వాసుదేవరెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా పింఛన్లు అమలు చేస్తున్న ఏకైక  రాష్ట్రం తెలంగాణ అన్నారు. అనంతరం ఆయా పార్టీలకు చెందిన పలు కుటుంబాలు బీఆర్​ఎస్​లో చేరాయి. కార్యక్రమంలో వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి, ఎంపీపీ బానోత్ శ్రీనివాస్ నాయక్, డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్, జడ్పీటీసీ ఇంటూరి బేబీ, మండల అధ్యక్షుడు వేముల వీరయ్య, సర్పంచ్ సత్యం, ఎంపీటీసీ పాల్గొన్నారు.