రామన్న, శంకర్ ఇద్దరూ ఒక్కటే: కంది శ్రీనివాస్​రెడ్డి

ఆదిలాబాద్​టౌన్, వెలుగు: ఆదిలాబాద్​ఎమ్మెల్యే జోగు రామన్న, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్​ శంకర్​ఇద్దరూ ఒక్కటేనని, వారి మాటలు నమ్మి మోసపోవద్దని కాంగ్రెస్​అభ్యర్థి కంది శ్రీనివాస్​రెడ్డి ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ప్రజాసేవా భవన్​లో ఆయన ఆధ్వర్యంలో బంగారిగూడ, కైలాష్ నగర్, భాగ్యనగర్, హమాలీవాడ, ఇందిరానగర్, నెహ్రుచౌక్, డాల్డా కంపెనీ,న్యూ హోసింగ్ బోర్డు కాలనీలకు చెందిన పలువురు కాంగ్రెస్​లో చేరారు.

15 ఏండ్లుగా ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న జోగు రామన్న పాలనకు చరమగీతం పాడాల‌‌ని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే  పేద‌‌ల బ‌‌తుకుల్లో వెలుగులు నింపుతామ‌‌న్నారు. డీసీసీ మాజీ చైర్మన్ ముడుపు దామోదర్ రెడ్డి, నాయకులు సెడ్మకి ఆనంద్ రావు, భూపెళ్లి శ్రీధర్, ఐనేని సంతోష్‌‌ రావు, నాగర్కర్ శంకర్, ఎంఏ షకీల్, సుజాత్ అలీ తదితరులు పాల్గొన్నారు.