
కంది, వెలుగు : ఇసుక అక్రమ ఫిల్టర్లు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని కంది తహసీల్దార్ విజయలక్ష్మి హెచ్చరించారు. సోమవారం కంది మండలంలోని బ్యాతోల్, ఎర్ధనూర్ తదితర గ్రామాల్లో నిర్వహిస్తున్న ఇసుక అక్రమ ఫిల్టర్లు కూల్చివేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఇసుక ఫిల్టర్ నిర్వాహకులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.