- కొత్తగూడెం బస్టాండ్‌లో హమాలీల నిరసన
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఆర్టీసీలో పనిచేస్తున్న హమాలీలను ప్రభుత్వం ఆదుకోవాలని హమాలీ వర్కర్స్ యూనియన్ భద్రాద్రికొత్తగూడెం జిల్లా గౌరవ అధ్యక్షుడు కందుల భాస్కర్ డిమాండ్ చేశారు. ఈ విషయమై మంగళవారం కొత్తగూడెం బస్టాండ్‌లోని కార్గో సెంటర్ వద్ద హమాలీలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ హమాలీలకు ఇచ్చే కమీషన్ పాత పద్ధతిలోనే చెల్లించాలన్నారు.
కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. చాలీచాలనీ డబ్బులతో హమాలీలు కుటుంబాలను పోషించుకోలేక అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడుతోందన్నారు. తమ సమస్యలపై సీఎం రేవంత్‌రెడ్డిని కలువనున్నట్టు తెలిపారు. ఈ ప్రోగ్రాంలో యూనియన్ నాయకులు కొమరయ్య, రాజు, వెంకన్న, నరేశ్, రాంబాబు, వెంకట్రావు, వీర నారాయణ, గంగరాజు పాల్గొన్నారు.