వికారాబాద్, వెలుగు: తెలంగాణ మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లాలో ఐదు కందుల కొనుగోళ్ల కేంద్రాలు ప్రారంభించినట్లుజిల్లా మార్క్‌ఫెడ్ అధికారి తహీమీన సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొడంగల్ (పీఎసీఎస్), మర్పల్లి (పీఎసీఎస్), తాండూరు(డీసీఎంఎస్), వికారాబాద్ (డీసీఎంఎస్), పరిగి (డీసీఎంఎస్) కేంద్రాల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధర క్వింటాకు రూ. 7,550కు అమ్ముకోవచ్చని పేర్కొన్నారు.
దళారుల చేతిలో మోసపోవద్దని, ఇతర సందేహాలకు 7288879812కు సంప్రదించాలని సూచించారు.