‘మల్లేశం’ మస్తుగుంది

థియేటర్​కి వెళ్లి సినిమా చూడక చానాళ్లు అయింది. నెట్​ఫ్లిక్స్​, అమేజాన్​ ప్రైమ్​ సర్వీసులు వచ్చాక మూవీ మహల్స్​ని మర్చిపోయాను. అయితే, మంచి తెలుగు సినిమాలను మాత్రం మిస్​ కావట్లేదు. వాటిని ఆన్​లైన్​లో రెగ్యులర్​గా చూస్తున్నా. ఈ మధ్య కాలంలో నాకు బాగా నచ్చిన చిత్రం​ ‘కేరాఫ్​ కంచరపాలెం’. రీసెంట్​గా ‘మల్లేశం’. నిజం చెప్పాలంటే ‘కేరాఫ్​ కంచరపాలెం’ కన్నా ‘మల్లేశం’ సినిమాకే నేను నాలుగు మార్కులు ఎక్కువ వేస్తా. స్టోరీని నమ్ముకొని, దాన్ని అందరి మనసులకూ హత్తుకునేలా తీసిన సినిమా ఇది. ఇందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

బయోపిక్​లు తీయటం ఒక రకంగా రిస్క్​తో కూడిన ప్రయత్నమనే చెప్పాలి. ఎక్స్​పర్​మెంట్​గా భావించి తెరకెక్కించే మూవీల్లో స్పెషల్​ ఎఫెక్ట్​లకు పెద్దగా స్కోప్​ ఉండదు. క్రియేటివిటీ ప్రదర్శించటానికీ వీలు పడదు. అందువల్ల అవి డాక్యుమెంటరీలుగా మిగిలిపోతాయి. బడ్జెట్​పరంగా నష్టాలు మూటగట్టుకోవాల్సి వస్తుంది.   ‘కేరాఫ్ కంచరపాలెం’ను​ ధైర్యంగా తీశారు. అది ఒక మంచి ప్రయత్నం. కానీ.. ప్రొడక్షన్​ క్వాలిటీ పరంగా (ముఖ్యంగా ఆడియో విషయంలో) ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది. ‘మల్లేశం’లో ఇలాంటి మైనస్​ పాయింట్లు రిపీట్​ కాకుండా చక్కగా డీల్​ చేశారు. ఈ సినిమాలో దాదాపు అన్ని విభాగాలూ తమ మార్క్​ చూపించాయి. సినిమా నిర్మాణంలో ఎక్కడా రాజీపడలేదు​.

తెలంగాణ యాస ప్రతి మాటలో వినిపిస్తుంది. అన్ని క్యారక్టర్లూ సింపుల్​గా, నేచురల్​గా అనిపిస్తాయి. యాక్టర్లంతా తమ పాత్రల్లో జీవించారు. ఝాన్సీ రోల్ చాలా రియలిస్టిక్​​గా ఉంది. తెలంగాణలోని రూరల్​ ఏరియాల్లో లైఫ్​ ఎలా ఉంటుందో ఈ సినిమాలో అచ్చుగుద్దినట్లు చూపించారు. ప్రజల అమాయకత్వానికి, కట్టూ బొట్టుకి అద్దం పట్టారు. ప్రతి సీనూ ప్రతి ప్రేక్షకుణ్ని కదిలించేలా ఉంటుంది. మ్యూజిక్​, సినిమాటోగ్రఫీ, డైలాగ్స్​ ఆకట్టుకుంటాయి. ‘మల్లేశం’ సినిమా డైరెక్టర్​, ప్రొడ్యూసర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. వాళ్ల కష్టానికి ఫలితం దక్కింది. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే.. తెలంగాణ డైరెక్టర్లు ఇటీవల తమ టాలెంట్​ని నిరూపించుకుంటున్నారు. ‘మల్లేశం’ను చూట్టానికి జనం పెద్దగా రావట్లేదనే సాకుతో దీని గురించి తక్కువ చేసి మాట్లాడకూడదు. మంచి సినిమాకి ప్రేక్షకుల సంఖ్య కొలమానం కాదు. ‘మల్లేశం’ మూవీకి సరైన రెస్పాన్స్​ రాకపోతే అది ఫిల్మగోయెర్స్​ టేస్ట్​లో లోపమే.

​– కందుల రమేశ్, ​సీనియర్​ జర్నలిస్ట్